19, మే 2021, బుధవారం

మనసు మాట..!!

   నిన్న నాకు వచ్చిన ఫోన్ కాల్ తో చాలా సంతోషమూ అనిపించింది. అదే క్షణంలో కొంచం బాధ కూడా వేసింది.

   పుస్తకాలు అచ్చు వేయడం చాలా శ్రమతేనూ, ఖర్చుతోనూ కూడుకున్న పని. ఇలా పుస్తకం వేయాలనుకోగానే అలా పుస్తకం మన చేతికి వచ్చేయదు. ఎవరి దగ్గరైనా ఏదైన తీసుకోండి. కాని పుస్తకం తీసుకుని, దాని మీద సంతకం చేయించుకుని పాత పుస్తకాల షాపులకు అమ్మకండి.
శ్రీనివాస్ గారికి అని నేను రాసి సంతకం చేసిన పుస్తకం పాత పుస్తకాల షాపులో ఎవరో తీసుకుంటే, ఆయన చేతి నుండి వీరు తీసుకున్నారు. చదువుతూనే అభిమానంగా ఫోన్ చేసి పలకరించారు.
    అమ్మా మీకు నమస్సులు మీరచన సడిచేయని (అ )ముద్రితాక్షరాలు చదువుతున్నాను మనసును హత్తుకొంటోంది ధన్యవాదములు.

మా చిరునామా :కాగిత నాగేశ్వరావు (శ్రీచరణ ) పాటిమీదరామాలయాంవద్ద, కొండెవరం పోస్ట్, యూ. కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి డిస్ట్రిక్ట్, పిన్ :533450, చరవాణి :9989795365🙏

నా వివరాలు అడిగి తమ నాటకం కోసం కథ రాయమని అడిగారు. నాకు కథలు రాయడం రాదన్నా వినలేదు. నా మిగతా పుస్తకాలు కూడా పంపమన్నారు.

  అడిగిమరీ తీసుకుని పాత పుస్తకాలకు వేయకండి. నా దగ్గర లేకుండా చేసుకున్నాను, చాలామందికి అపాత్రదానం చేసి.

ఓ చెడు మరో మంచికే అన్న మా హిందీ టీచర్ రత్నకుమారి గారి మాట మరోసారి బుుజువయ్యింది.

అందరికి ధన్యవాదాలు..

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner