20, మే 2021, గురువారం

నేను...!!

నేనంటే..
అమ్మచాటు
ఆడపిల్లని 
ఆటలాడే
అల్లరి పిల్లని
నాన్నకు
గారాలపట్టిని
చిలిపి తలపుల
చిన్నపిల్లని
బంధాలకు
బంధీని
బాధ్యతలకు
చిరునామాని
సంఘర్షణల నడుమ
చెకుముకి రాయిని
జీవిత కొలిమిలో
నిప్పు కణికని
పరిధి నెరిగిన
ప్రౌఢ ముదితని
ఆత్మీయతల కోసం
వెదుకులాడే అమాయకత్వాన్ని
ఓటమికి వెరవని
ధైర్యాన్ని
కదులుతున్న కాలంలో
గమ్యానికై నడుస్తున్న గమనాన్ని
కొందరికి
మింగుడు పడని నిజాన్ని
అన్ని వెరసి
అహం నిండిన 
ఆత్మాభిమానాన్ని..!!


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner