20, మే 2021, గురువారం

అందం...!!

ఓ పదానికి
అర్థాలు వెతికే క్రమంలో
కనిపించిన నిజాల నీడలెన్నో
అబద్ధాల అగాధాలెన్నో
రూపమెా శాపమెా
తెలుసుకోవాలన్న 
మనిషి అంతర్మధం

అప్పుడే పుట్టిన 
పాపాయి బోసినవ్వులోనూ
చిన్నతనపు అల్లరి కేరింతల్లోనూ
ముదిమి వయసు ముచ్చట్లలోనూ
పలకరింపుల పరిచయాల్లోనూ
ఇలా జీవితపు అన్ని క్షణాల్లోనూ
తారసపడుతూనే ఉంది
తనను గుర్తెరగమంటూ

చూసే కనులకు తెలిసేదొకటని
కనిపించని మనసుకు 
కనిపించేది మరొకటని
మౌనానికి మాటకు మధ్యన
మనిషితనానికి
మనసుతనానికి 
చేరికైన వ్యక్తిత్వానికి చిక్కిన
అసలైన అందం ఆత్మానందమేనని
అదే పరమానందమని...!! 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner