7, మే 2021, శుక్రవారం
సంస్కారవంతులు...!!
నేస్తం,
ఈ కరోనా వచ్చి జనాన్ని ఏం చేస్తోందో తెలియదు కాని, కొందరు చదువుకున్న మూర్ఖులను బయటికి తెలిపింది. ఏ కష్టమయినా, బాధయినా మనకు వస్తే అది పగవాళ్ళకు కూడా రావద్దనుకుంటాం. కాని కొందరు మరి వాళ్ళకు ఏ పేరు పెట్టాలో కూడా తెలియడం లేదు. ఇలాంటి వారి మూలంగానే కరోనా అంతటా వ్యాపించేస్తోంది.
రోగం రావడం సహజం. వచ్చిన రోగం కరోనా. కనీసం చుట్టుపక్కల వారికి చెప్పాలన్న ఇంగితజ్ఞానం ఉండాలి కదా. వారు మాత్రం ఇంట్లో కూడా మాస్క్ లు పెట్టుకు తిరుగుతూ, అదేమని అడిగితే మేమూ చదువుకున్నాం, మాకూ తెలుసు, కావాలంటే రిపోర్ట్స్ చూపిస్తాం అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం. రోజూ తిండితిప్పలు, సరుకులు, షాపింగ్ లు అన్ని బయటి నుండి రావడాలే. కనీసం ఆర్డర్ కిందికి వెళ్లి తెచ్చుకోమంటే లా పాయింట్లు మేము మెయింటెనెస్స్ ఇవ్వడం లేదా అని అడగడము. చేసేది టీచింగ్ ఉద్యోగం. మరి ఈ తరహా మెంటాలిటి వారు పిల్లలకు ఏం నీతులు చెప్తున్నారో...!
చదువు ఉంటే సరిపోదు. సంస్కారం అనేది కూడా మనకు ఉండాలి. మనం బావుంటే చాలు. పక్కవారు ఏమైతే మనకెందుకు అనుకుని బతికేయాలనుకుంటే, రేపటి రోజున కాదు, ఈరోజే గుక్కెడు నీళ్ళు తాగడానికి కూడా దొరకవు. తాతకు పెట్టిన ముంత తల వైపునే ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఇప్పటి కర్మ ఇప్పుడే అనుభవించే పోతామన్న సంగతి తెలుసుకోవాలి. కనీసం మనిషిగా మసలుకోవడం నేర్చుకోండి.
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి