23, మే 2021, ఆదివారం

చెలిమంటే..!!

అతి చిన్న కణాలతో
అనునిత్యం 
అలుపెరగని 
పోరాటం

రేపంటే
భయం లేదు
క్షణాలతో
సహచర్యం నాదైనప్పుడు 

అలసిపోని
అంతరంగం
ఆటలాడుకుంటోంది
భావాలతో

శరీరంతో
పనేముందిక
శాశ్వత స్నేహం
అక్షరాలతో పెనవేసుకున్నాక...!! 

1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Sri[dharAni]tha చెప్పారు...

ఔనండి: చెలి మంటే, దగ్గర దూరం ఏదైనా తంటే

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner