28, మే 2021, శుక్రవారం

ఏక్ తారలు..!!

1. నాలుగు తరాలు బావుండాలని_కన్నీళ్లను కతలుగా మార్చేస్తూ...!!
2.    మనసు విప్పిన మాటలే అవి_కథలుగా మలిచిన కాలానికి సంకేతాలుగా...!!
3.  కొన్ని జీవితాలంతే_చీకటి బతుకే చరితార్థమనుకుంటూ..!!
4.  అక్షరాలన్నీ అవే_రాసే చేతిలోనే మార్పులు చేర్పులు...!!
5.  పలకరిపులన్నీ అవే_నటనో నిజమెా తెలియనీయకుండా...!!
6.  అంతరంగం అంతర్మధనం ఒక్కటే_అక్షరాలెటు మారినా....!!
7.   మెామాటానిదేం ఉంది_మాటలు కలవడమే ముఖ్యం కదా...!!
8.   వెలితి మనది కాదు_అనుబంధాన్ని గుర్తించలేని మనుష్యులది...!!
9.   వెటకారమే సరైనది_పలకరింపులో మాధుర్యం తెలియని కొందరికి...!!
10.   చెప్పుకునేది స్వ'గతమే_ఎందరికో గతాన్ని గుర్తు చేసేస్తూ...!!
11.   సందిగ్ధాన్ని పక్కన పెట్టడమే_సమస్యలతో పోరాటం మన సంకల్పమైనప్పుడు..!!
12.   జ్ఞాపకమెప్పుడూ స'జీవమే_మనదని మనసుకు చేరికైనప్పుడు..!!
13.   మౌనాన్ని వినమంటుంది మనసు_లోకం వినలేని నిశ్శబ్ధంలో...!!
14.   గతజన్మ అనుబంధమే ఇది_అక్షరాలకిలా తెలిసిందనుకుంటా ...!!
15.   బంధమైన అనుబంధమిది_అనుకోని ఆత్మీయతగా మనసున చేరి..!!
16.   కొన్ని సంతోషాలింతే_యుగాలు గడిచినా కొలమానాలక్కర్లేనివిగా...!!
17.  తలపుల అలజడితో అలసినందుకేమెా_నిస్త్రాణతకు చోటు దొరికిందనుకుంటా...!!
18.   ఆత్మానందమే అది_అవధులు లేని అనుబంధం తానయ్యాక..!!
19.   నిదరోవాలనే అనుకుంటున్నా_కలల అలికిడి వినబడకుండా..!!
20.   సత్య శోధనలే నిరంతరం_ఆత్మ సాక్షాత్కారానికి రాదారి వెదుకుతూ...!!
21.  మనసు గాయమది_మాసిపోదు రెప్ప పడినా పడకున్నా..!!
22.   కతలెన్ని చెప్పాయెా కదా_గతాన్ని కదిలిస్తే..!!
23.  వధశిలలెన్ని ఒరిగాయెా_వ్యథలకు తట్టుకోలేక...!! 
24.  అనంతమై వ్యాపించి ఉన్నా_అక్షరాలతో ఆత్మానందం పంచడానికన్నట్టుగా...!!
25.  ఆంతర్యం పెరుమాళ్లకెరుక_ఏ బంధానికే పాశమెంత వరకోనని..!!
26.   భద్రమంటోది గతాన్ని చెప్పిన అక్షరం_వర్తమానానికి దిక్సూచిగా..!!
27.   కథనం తెలిసిందనుకున్నా_కన్నీరు కలవర పడినప్పుడు..!!
28.   అనుభవం అక్షరంగా మారింది_ఒత్తిడి ఒరవడిని తగ్గించడానికి..!!
29.   సమాధానం చెప్పగలదు సహనం_అహపు పరిధులను గుర్తుజేస్తూ..!!
30.   ఉలుకు తెలియని మనుషులంట మరి_పలకరింతలకు పాశాలను అందనీయరుగా..!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner