23, మే 2021, ఆదివారం
బంధం..!!
సంతస పడినవారే
వెదికేస్తున్నారిప్పుడు
మాకు కావాలంటే మాకు కావాలని
చేజార్చుకున్నప్పుడు
చింత పడలేదెవ్వరూ
పోతే పోయిందిలే మనకెందుకని
మనసును తేలిక చేసుకున్నారప్పుడు
మనకేంటి డబ్బు మీద నడుస్తున్నాం
తోటి మనిషితో పనిలేదని
విర్రవీగారొకప్పుడు
రక్త సంబంధాలను కాదన్నారు
రాతి మనుషులుగా బతికేస్తూ
కాలంతో కలిసి ప్రకృతి నేర్పుతున్న
గుణపాఠాలను గుర్తెరగకుంటే
పేగు బంధమూ లేదు
పెంచుకున్న పాశమూ మిగలదు
అవసరానికి అక్కరకు రాని
అనుబంధాలుగానే చరిత్రలో
గత ఆనవాలుగానే నిలిచిపోతాయి...!!
వర్గము
కవితలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి