11, మే 2021, మంగళవారం
నవ్వు...!!
తన లక్షణంగా చేసుకున్న
నవ్వుల చాటున దాగిన మర్మాలెన్నో
మనసు ఏడుస్తున్నా
కనులకు నవ్వడం నేర్పిన
చతురత ఆ పైవాడిదే
రాని నవ్వును
పెదవులపై పూయించడం
ఎంత కష్టమెా అనుభవమైతేనే తెలుస్తుంది
కన్నీటి బాష్పాలను
పన్నీటి చుక్కలుగానూ చూపించే
విద్యను నేర్చిన మనిషి మేధావే మరి
ఈ భూమిపై నజరానాలెన్ని మనకందినా
భగవదనుగ్రహంగా లభించే వరం
చిరునవ్వు...అది కొందరికే సొంతం...!!
వర్గము
కవితలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
అలివి కాని చోట భయ పడితే దక్కేదేమి లేదు దుఃఖం తప్ప
భయం పట్ల గౌరవం లేకుంటే విలువే లేదు ప్రాణానికింక
సువిశాల ఆకాశం అంతే చదును భూమి
కాని ఆరడుగులు మూడడుగుల నిష్పత్తి కి చివరకు మిగిలేది పదెనిమిది చదరపు అడుగులే
కాటిలో చితి పేర్చితే నిలువున దేహం కేవలం పిడతంత బూడిదే
~శ్రీత ధరణి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి