23, మే 2021, ఆదివారం

నేనేంటంటే...!!

నటించే నైజం
నాదైనప్పుడు 
నిజమేంటో
నాకెందుకు? 

కలసి వస్తున్న
కాలం వదలకుండా
నాతోనే కదులుతున్నప్పుడు
మరొకరితో నాకు పనేంటి? 

మరో మనిషి
నాలో ఉన్నాడని
నలుగురికి తెలియనప్పుడు
నాకెదురేముంది? 

వ్యవస్థతో పని లేదు
వాస్తవం విప్పి చెప్పాలన్న
కోరికసలే లేదు
ఎవరెలా పోతే నాకేంటి? 

నా రాతలేమైనా కానీ
అసత్యాలకు నిలయమైనా
వ్యక్తి భజనకు పూనుకున్నా
నేనేదగాలన్న ఆశయం కోసమేగా...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner