16, మే 2021, ఆదివారం

సమస్య..

నేస్తం, 
      మన దైనందిన జీవితంలో ప్రతిరోజూ ఏదోక సమస్యతో సహజీవనం చేస్తూనే ఉంటాం. అది ఎవరి మూలంగానైనా కావచ్చు. ఇదిలా ఉండగా మనమూ మరొకరికి సమస్యగా మారడం అవసరమంటావా? మన సమస్యల తీవ్రత మనకు చాలా అసహనాన్ని కలిగిస్తూ ఉంటుంది. ప్రపంచంలో మనదొక్కరిదే కొరుకుడు పడని సమస్య కాదు. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా ఉంటుంది. 
     నిజంగా చెప్పాలంటే ఈ ఆధునిక పరికరాల వినియెాగం వచ్చాక మనమూ వాటి మాదిరిగానే యంత్రాలుగా మారిపోయాం. మన చుట్టూ ఎందరున్నా మనం ఒంటరితనం ఫీల్ అవుతున్నామని, మరొకరి సమయాన్ని మనం తీసుకోవాలనుకోవడం సముచితం కాదు. మన చుట్టూ ఉన్న పరిస్థితులను, పరిసరాలను గమనించుకుంటూ మన మూలంగా మరొకరు ఇబ్బంది పడకుండా జీవించగలిగితే చాలు. ప్రేమలు, ఇష్టాలు, కోపాలు, శాపాలు ఇలా అన్ని అనుభూతుల అనుభవాల సమన్వయమే మానవ జీవితం. ఇలాంటి మానవ జీవితంలో ఉన్న సమస్యలకు తోడుగా లేని సమస్యలను ఊహించుకుని, క్షణక్షణం భయపడుతూ,మరొకరిని భయపెడుతూ బతకడం అవసరమంటావా! నువ్వే ఆలోచించు...!!
       
        

1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

citizen చెప్పారు...

some people are always sad.
They just cry for everything like the boy and wolf story.
When there is real need, no one will be there.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner