26, మే 2021, బుధవారం
గుత్తమైన గులాబి...!!
గుర్తులని తెలిసినా
అంకురం నుండే అందంగా
అరవిరియాలని చూస్తుంది
మెుగ్గగా కష్టాలను దాటుకుంటూ
సుతిమెత్తగా తాకీతాకని పరిమళంతో
ముగ్ధంగా మురిపించాలన్న
తాపత్రయమే దానిదెప్పుడూ
నాకెప్పుడూ ఆశ్చర్యమే
పుట్టుక నుండే ముళ్ళపానుపు
తన చుట్టూ బలీయమై ఉన్నా
ఆ బంధనాలను ఆలవోకగా ఎలా దాటేస్తుందిదని
గుత్తంగా విచ్చుకుంటూ
మెత్తంగా మగువ మనసు దోచే పూరాణి
మత్తుగా గమ్మత్తుగా మరులు గొలిపే గులాబి
చెప్పీ చెప్పని జీవన సత్యాలెన్నో...!!
వర్గము
కవితలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి