24, మే 2021, సోమవారం

కాలం వెంబడి కలం..55

        ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు నైట్ లేట్ అవుతూ ఉండేది. మా మానేజర్ డిన్నర్ తెప్పించేవాడు. అందరికన్నా ముందు నన్ను పిలిచి తీసుకోమనేవాడు. సిటీ గ్రూప్ లో వారంతా చాలా బావుండేవారు మాతో. మా కాలేజ్ ఇంజనీరింగ్ జనాభా చాలామంది డాలస్ లోనే ఉన్నారు. ఝాన్సీ, యశోద, నాగజ్యోతి, అనురాధ ఇంకా చాలామందే ఉన్నారు. నేను వీళ్ళని మాత్రమే కలిసాను. కొందరు జూనియర్స్ అబ్బాయిలు కూడా పలకరించారిక్కడ. యశోద వాళ్ళ పాపని చూడటానికి వాళ్ళింటికి వెళ్ళితే, తర్వాత రోజు ఝాన్సీ కొడుకు పుట్టినరోజుకి ఝాన్సీ వాళ్ళింట్లో యశోద డ్రాప్ చేసింది. అక్కడే జ్యోతి కనిపించి, తర్వాత అను కి చెప్తే, అను ఫోన్ చేసి తన కొడుకు పుట్టినరోజుకి రమ్మంటే నాకు వెళ్ళడానికి కుదరకపోతే, తర్వాత తనే మా ఆఫీస్ కి వచ్చి లంచ్ కి నన్ను బయటికి తీసుకువెళ్ళింది. బోలెడు కబుర్లు చెప్పి బిల్ నన్ను పే చేయనీకుండా తనే పే చేసింది. అను, నీరజల ఫ్రెండ్ భావన కూడా సిటీ గ్రూప్ లోనే వర్క్ చేసేది. మూడు నెలల ప్రాజెక్ట్ 6, 7 నెలలు జరిగింది. మధ్యలో లాంగ్ వీకెండ్ వచ్చినప్పుడు, మరో రెండు రోజులు లీవ్ పెట్టి హంట్స్విల్ వెళ్ళి వచ్చేదాన్ని. పాపం మా చైనీస్ కో ఆర్డినేటర్ బాగా కో ఆపరేట్ చేసేది. తను లీవ్ లో వెళ్ళినప్పుడు మేం చూసుకునే వాళ్ళం మరి. 
           సాయంత్రం 5 కి మా వర్క్ అయిపోయేది. అవసరం అయినప్పుడు లేట్ అవర్స్ వర్క్ చేసేవాళ్ళం. సంధ్య ఏదో బేబి సిట్టింగ్ జాబ్స్ వెదికితే నైట్ 7 నుండి 11 వరకు పిల్లలని చూసే జాబ్ ఉందని చెప్పింది. నాకు ఆఫీస్ అయ్యాక ఎలానూ ఖాళీనే కదా అని, సంధ్య ఆ జాబ్ నాకు చెప్పింది. అందులోనూ అది రోజూ ఉండదు. అప్పుడప్పుడూ ఉంటుంది. వాళ్ళే వచ్చి పికప్, డ్రాపింగ్ చేస్తానంటే సరేనని ఆ జాబ్ ఒప్పుకున్నాను. అప్పుడప్పుడూ వీకెండ్ కూడా అడిగేవారు. అలా వచ్చిన డబ్బులు అన్నీ మా కోడూరులో షిరిడిసాయి గుడి కడుతుంటే దానికి ఇచ్చేసాను తర్వాత. అంతకు ముందు కూడా పేపర్ లో చూసి ఎవరో పాపకి ఓ 150 డాలర్లు నా దగ్గర లేకపోయినా క్రెడిట్ కార్డ్ నుండి తీసి మరీ పంపాను. నేను చేసింది చిన్న సాయమే వాళ్ళకి. ఓ ఆంటి వాళ్ళంట్లో పనమ్మాయి కూతురు ఆ పాప. తర్వాత ఆంటి పెద్ద లెటర్ రాశారు. అప్పట్లో వార్త పేపర్ లో కూడా వేసారు ఆ విషయం. నా జాబ్ సిటీ గ్రూప్ లో అయిపోయినప్పుడు డాని, డాన్ లు నాకు సెండాఫ్ పార్టీ ఇచ్చారు. నివాస్ గారిని, తన వైఫ్ అపర్ణని కూడా కలిసాను. మంచి మెమరీస్ డాలస్ సిటీ గ్రూప్ తో ఇప్పటికి సంతోషాన్నిస్తూ.. 
         హంట్స్విల్లో ఇదే టైమ్ లో మా ఎదురింటికి తెలుగువాళ్ళు వచ్చారు. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. తర్వాత పాప పుట్టింది. చిన్నుకు కదా నాకేమెా అమ్మాయిలంటే ఉన్న ఇష్టంతో ఎక్కువగా దగ్గరకు తీసేదాన్ని. వాళ్ళ అమ్మానాన్న వచ్చారు. ఎందుకో తెలియదు కాని నాతో ఎంతో బావుండే రమణి గారు మాట్లాడటం మానేసారు ఆ తర్వాత నుండి. లక్ష్మి గారని తెలుగావిడ ఆ టైమ్ లోనే పరిచయం అయ్యారు. ఏంటో మనుషులు వివిధ రకాలన్నట్టుగా ఉండేవారు అందరు. సీతక్క, మామయ్య వాళ్ళు నాతో బావుండేవారు. చౌదరి గారు ఇల్లు కొనుక్కున్నప్పుడు సీతక్క వాళ్ళింటికి తీసుకువెళ్ళింది. అంతకు ముందు ఓసారి జనవరి ఫస్ట్ కి ఫంక్షన్ విష్ణు వాళ్ళు చేసినప్పుడు మాట్లాడింది. అప్పటినుంచి రాకపోకలుండేవి మాకు వాళ్ళకి. మా కాకాని డాక్టర్ గారికి మేనల్లుడే మామయ్య. అప్పటి నుండి బాగా క్లోజ్ గా ఉండేవారు సీతక్క, మామయ్య. మన తెలుగువారు ఎక్కడ ఉన్నా రాజకీయాలే అన్నట్టు ఎవరి అవసరం కోసం వారి నటన అన్నమాట. తెలుకోలేకపోవడం మన తప్పు. 

" జీవితంలో రాణించాలంటే నటన ఉండాలని తెలియక పోవడం, అందరూ మంచివారే అని సర్దుకుపోవడం మన తప్పని తెలుకోవాలి. ఎదుటి మనిషి నడవడిని బట్టే మనమూ ఉండాలన్నది సత్యం. "

వచ్చే వారం మరిన్ని కబుర్లతో....

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner