లయగ్రాహి
గణ విభజన
UII | IUI | IIU | III | UII | IUI | IIU | III | UII | IUU |
భ | జ | స | న | భ | జ | స | న | భ | య |
ఎందుని | లనేజ | నులకుం | దలఁప | రానిత | పమంది | కొనిచే | సిరొకొ | నందుఁడు | యశోదా |
లక్షణములు
• | పాదాలు: | నాలుగు – కాని పఠన, లేఖన సౌకర్యార్థం పాదమును 2గా విభజించ వచ్చు. | ||||||||||||||||||
• | అక్షరాలు 30 | |||||||||||||||||||
• | ప్రతిపాదంలోని గణాలు: | భ, జ, స, న, భ , జ, స, న, భ, య | ||||||||||||||||||
• | యతి : | |||||||||||||||||||
• | ప్రాస: | పాటించవలెను | ||||||||||||||||||
• | ప్రాస: యతి | ప్రాసయతి స్థానములు – 2వ, 10వ, 18వ, 26వ అక్షరములు. |
భ జ స న భ జ స న భ య
ఛందస్సు గల వృత్తము/ఉద్ధురమాల లయగ్రాహి. భజసనభజసనభయ అంటే తెలియటలేదు గానీ,
దీని ఛందస్సు చాలా తేలిక. UIII అని ఏడు సార్లు వచ్చి, చివఱిగా UU అని
వస్తుంది. అంటే..గణములు:- UiII UIII UiII UIII UiII UIII UiII UU
నడక :- లాలలల లాలలల లాలలల లాలలల లాలలల లాలలల లాలలల లల్లా
ఒక
గురువు నాలుగు లఘువులు వస్తూండాలి. ఇక ఇందులో యతి వుండదు. ప్రాసయతి మాత్రం
వుంటుంది - పై క్రమములో i వున్న చోట, అంటే పాదానికి నాలుగు సార్లు !
సీసంలోలా కాకుండా ఇందులో ఆ నాలుగు సార్లూ ఒకే ప్రాస రావాలి. నాలుగు
పాదాల్లోనూ ఒకే ప్రాస వుండాలి! కాబట్టి మీరు ప్రాసగా ఎంచుకున్న పదబంధానికి
మీ దగ్గర కనీసం పదహారు ఉచిత ప్రయోగాలు వుండకపోతే, పద్యము వ్రాసే పనిని ఆ
వాగమశాసనుడికి వదిలివేసుకోవాలి.
మహాభారతం
ఆది పర్వములో నన్నయ్యభట్టు వసంత వర్ణనకి లయగ్రాహి వృత్తాని దివ్యంగా
వాడారు అని నేనడం, సీమకోతి హనుమంతునికి సిపారసు ఇవ్వడంలాగుంటుంది. క్రిత
వారం గరికిపాటి నరసింహారావుగారు, భక్తి దూరదర్శన స్రవంతిలో వసంత వర్ణనకి
సంబంధించిన ఈ రెండు లయగ్రాహి పద్యాలను చాలా చక్కగా వినిపించి, అంత కన్నా
చక్కగా వివరించారు. ఆయన మాటల్లో చెప్పాలంటే, "నన్నయ్య వ్రాసిన ఈ పద్యాలు
వినడానికి, వాటిని నేను మీకు వివరించడానికి మీరెంతో అదృష్టవంతులు".
మీరెలాగూ వినలేకపోయారు, కనీసం చదువుకొని ఆనందించండి.
లయగ్రాహి
గణములు:- భజసన భజసన భయగణములు:- UiII UIII UiII UIII UiII UIII UiII UU నడక :- లాలలల లాలలల లాలలల లాలలల లాలలల లాలలల లాలలల లల్లా
లయగ్రాహి.
కమ్మని లతాంతములకు మ్మొనసి వచ్చు మధు-పమ్ముల సుగీత నినదమ్ములెసఁగెం జూ
తమ్ముల లసత్కిసలయమ్ముల సుగంధిముకు-ళమ్ములను నానుచు ముదమ్మొనర వాచా
లమ్మలగు కోకిల కులమ్ముల రవమ్ము మధు-రమ్మగుచు విన్చె ననిశమ్ము సుమనోభా
రమ్ముల నశోకనికరమ్ములను జంపకచ-యమ్ములును గింశుకవనమ్ములును నొప్పెన్
లయగ్రాహిచందనతమాలతరులందు నగరుద్రుమము-లందుఁ గదళీవనములందు లవలీమా
కందతరుషండములయందు ననిమీలదర-విందసరసీవనములందు వనరాజీ
కందళితపుష్ప మకరంద రసముం దగులు-చుం దనువు సౌరభమునొంది జనచిత్తా
నందముగఁ బ్రోషితులడెందములలందురఁగ - మందమలయానిల మమంద గతి వీచెన్
పోతన తెలుగు భాగవతంలో వాడిన లయగ్రాహి వృత్త పద్యాల సంఖ్య: 4
కూలిరి వియచ్చరలు; సోలిరి దిశాధిపులు; వ్రాలి రమరవ్రజము; దూలి రురగేంద్రుల్;
ప్రేలిరి మరుత్తు; లెదజాలిగొని రాశ్వినులు; కాలుడిగి రుద్రు లవలీలబడి రార్తిన్;
వ్రేలిరి దినేశ్వరులు; కీలెడలినట్లు సురజాలములు పెన్నిదుర పాలగుచు ధారా
భీల గతితోడఁ దమ కేలి ధనువు ల్విడిచి నేలఁబడి మూర్ఛలను దేలిరి మహాత్మా!
లయవిభాతి
గణ విభజన
III | IIU | IIU | III | IIU | III | III | IIU | III | III | III | U |
న | స | స | న | స | న | న | స | న | న | న | గ |
పడయ | రెతనూ | భముల | న్బడయు | దురుగా | కపెర | పడతు | లునుభ | ర్తలును | బడసి | రెతల | పన్ |
లక్షణములు
• | పాదాలు: | నాలుగు – కాని పఠన, లేఖన సౌకర్యార్థం పాదమును 2గా విభజించ వచ్చు. | |
• | అక్షరాలు 34 | ||
• | ప్రతిపాదంలోని గణాలు: | న, స, స, న, స, న, న, స, న, న, న, గ | |
• | యతి : | ||
• | ప్రాస: | పాటించవలెను | |
• | ప్రాస: యతి | ప్రాసయతి స్థానములు – 2వ, 11వ, 20వ, 29వ అక్షరములు |
లయవిభాతి
చలువ గల నెన్నెలల చెలువునకు సౌరభము
- గలిగినను సౌరభముఁ జలువయుఁ దలిర్పం
బొలు పెసఁగు కప్పురపుఁ బలుకులకుఁ గోమలత
- నెలకొనిన సౌరభముఁ జలువ పసయుం గో
మలతయును గల్గి జగముల మిగులఁ బెంపెసఁగు
- మలయ పవనంపుఁ గొదమలకు మధురత్వం
బలవడిన నీడు మఱి కల దనఁగ వచ్చుఁ గడు
- వెలయఁ గల యూ సుకవి పులుకులకు నెంచన్
ఛందస్సు :- నసన నసన నసన నసగ
గణములు:- IiIII UIII IiIII UIII IiIII UIII IiIII UU
నడక :- లలలలల లాలలల లలలలల లాలలల లలలలల లాలలల లలలలల లల్లా
ఉదాహరణ 1:
పోతన తెలుగు భాగవతంలో వాడిన లయవిభాతి వృత్త పద్యాల సంఖ్య: 3హసితహరినీలనిభవసనమువిశాలకటి నసమనయనాద్రిపరిహసితమగుమేఘో ల్లసనమువహింపఁగరకిసలయముహేమమణి విసరవలయద్యుతులుదెసలతుదలందుం బసలఁగురియంగసరభసమునబలుండుదర హసితముముఖాబ్జముననెసఁగఘనకాలా యసమయమహోగ్రతరముసలమువడిన్విసరి కసిమసఁగిశత్రువులనసువులకుఁబాపెన్.
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
లయగ్రాహిని మూడేసి అక్షరాలా గణాల చాదస్తపు నియమంతో కాక నాలుగేసి అక్షరాల విభాగాలుగా చూస్తే దీని నడక సరిగా తెలుస్తుంది.
ప్రతిపాదంలోనూ 7 సార్లు భల గణం వచ్చి చివరన గగ అనే గణం వస్తుంది. (ఈ ఏడూకూడా ఒక్కొక్కటీ ఐదు మాత్రల పాటూ చివరిది నాలుగు పాత్రలపాటూ నడిచే గణాలు. కాని ప్రత్యక్షరం లఘువేదీ గురువేదీ అన్న నియతి ఉంది కాబట్టి మాత్రాగణాలు కావు.)
ఒకపాదం గణవిభజన చూడండి.
UIII UIII UIII UIII UIII UIII UIII UU
ఎందునిల నేజనుల కుందలఁప రానితప మందికొని చేసిరొకొ నందుఁడుయ శోదా
ఇటువంటి నడకనే లయవిభాతిలోనూ చూడండి.
ఈ పద్యాలను మూడక్షరాల గణాల వరుసగా ఎవరూ భావించి వ్రాయరు.
చక్కని మీ వివరణకు ధన్యవాదాలు అండి.... నేను సేకరించిన సమాచారంలో అలా ఉంది....నాకు తెలిసిన కొద్ది పాటిలో మీలాంటి పెద్దల వివరణలు నేర్చుకోవడానికి పనికి వస్తున్నాయి.....
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి